రైతును రాజు చేయడమే
కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అందుకు రైతులను చైతన్యపరిచి అభివృద్ధి చెందేందుకే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాలు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో నిర్వహిస్తున్నామని మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్ తెలిపారు. ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామి ఆదేశాల మేరకు చిన్నకోడూరు మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో రైతులకు అయిల్ ఫామ్ సాగు, పట్టుపురుగుల పెంపకం, పంటలకు సబ్సిడీ రుణాలపై అవగాహన కల్పించారు.