మానవ సమాజ సృష్టి కర్త, ఆది దేవుడు, జంబూద్వీప రాజ్య నిర్మాత ఆది జాంబవ మహారాజని, ఆయన స్వయంభువుడై వెలిశాడని మాదిగ జాగృతి సంఘం జిల్లా కన్వీనర్ వేముల మల్లికార్జున్ మహారాజ్ ఆదివారం అన్నారు. మాదిగ జాగృతి సంఘం సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆది జాంబవంతుని జయంతిని సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ వేముల మల్లికార్జున్ మహారాజ్ మాట్లాడుతూ సృష్టికి ఆధ్యుడు ఆది జాంబవంతుడని తెలిపారు.