తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ దరిపల్లి చంద్రం జెండా ఆవిష్కరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అవమానాలు ఎదుర్కొన్న తెలంగాణ ప్రజలు నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నారని, తెలంగాణ ఉద్యమం మరువలేనిదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన గొప్పదని, ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన
కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఉద్యోగులు,
కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.