సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలంలోని అకునూరు గ్రామంలో పైపులైన్ల నిర్మాణానికి గ్రామపంచాయతీ పాలకవర్గం చర్యలు చేపట్టింది. 5వ వార్డు సభ్యుడు జూపల్లి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం జరిగింది. సర్పంచ్ కొమ్ము రవి మాట్లాడుతూ, గ్రామంలోని అన్ని వార్డుల్లో తాగునీటి సమస్య లేకుండా చూడటమే లక్ష్యంగా, పైపులైన్లు లేని చోట వాటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.