సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయం వేలాది మంది భక్తులతో సందడిగా మారింది. భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేకాలు, పట్నాలు, ఒడిబియ్యం, అర్చనలు, గంగరేణి చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సిద్దిపేట సీనియర్ సివిల్ జడ్జి సంతోష్ కుమార్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 30వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.