సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో గత రెండు, మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పెద్ద చెరువు నిండి మత్తడి దూకడంతో వరద నీరు పట్టణంలోని ఇండ్లలోకి చేరింది. గాంధీ చౌక్ ప్రాంతంలో చేపడుతున్న వంతెన నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో రెండు వైపులా నీరు నిలిచి ప్రధాన రహదారిపై వెళ్లే వాహన దారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ దిలీప్ నాయక్, సీఐ ఎల్. శ్రీను, ఎస్ఐ నవీన్ జేసీబీ సహాయంతో గాంధీ చౌక్, కడవేర్గు వెళ్లే రోడ్డు ప్రాంతంలో వరద నీటిని కుడి చెరువులోకి మళ్లించారు.