జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత రావొద్దని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అదనపు కలెక్టర్లు గరిమా అగ్రవాల్, అబ్దుల్ హమీద్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా ఎక్కడ ఇసుక నిల్వలు ఉన్నాయో పరిశీలించి ఇళ్లు నిర్మించుకునే వారికి టోకెన్లు అందించాలన్నారు.