ప్రజాయుద్ధనౌక గద్దర్ 78వ జయంతి సందర్భంగా సిద్దిపేటలో ఆయన విగ్రహ ప్రతిపాదిత స్థలంలో గద్దర్ చిత్రపటానికి పలు దళిత బహుజన ప్రజాసంఘాల నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీజేఏసీ నేత, రిటైర్డ్ ప్రిన్సిపాల్ జి పాపయ్య మాట్లాడుతూ, ప్రజల కోసం పోరాడేవారే గద్దర్ అన్న నిజమైన వారసులని, ప్రజల పక్షాన నిలబడి, ప్రజా పోరాటాలకు అండగా నినదించడమే గద్దర్ అన్నకు మనమిచ్చే నివాళులని అన్నారు.