సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్, మరియు టౌన్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ బుధవారం పట్టణంలోని ప్రధాన రహదారులు, జంక్షన్లు, లోతట్టు ప్రాంతాలను సందర్శించి, వర్షం వల్ల ఏర్పడిన నీటి నిల్వలు, దెబ్బతిన్న రోడ్లు, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే పరిస్థితులను సమీక్షించారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి సంబంధిత శాఖలకు సమాచారం అందించినట్లు ఏసిపి తెలిపారు.