సిద్దిపేట జిల్లా మేడిపల్లి గ్రామంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న పాకాల శ్రీధర్ రెడ్డి (46) అనే వ్యక్తి గురువారం తన ఇంట్లోని పెంట్ హౌస్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.