సిద్దిపేట పట్టణ శివారులోని బూరుగుపల్లి వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొనడంతో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.