భారత వైమానిక దళం 'అగ్నివీర్' వాయుసేనలోకి సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూరుకు చెందిన ఇద్దరు యువకులు ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన నీరుడి సిద్ధార్థ, మాసాన్ పల్లి నందు బాల్య స్నేహితులు. డిగ్రీ చదువుతున్న వీరు అగ్నివీర్ వాయుసేన
నోటిఫికేషన్ చూసి మార్చి నెలలో అగ్నివీర్ పరీక్ష రాశారు. చక్కని ప్రతిభతో విజయం సాధించారు. ఆ తరువాత ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ పరీక్షల్లో సైతం అర్హత పొందారు. సోమవారం
ఫలితాలు వెల్లడి కాగా ఇద్దరు మిత్రులు అగ్నివీరులుగా ఎంపికయ్యారు. దీంతో ఇద్దరు మిత్రుల తోపాటు, రెండు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.