సిద్దిపేట: ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి టాక్సీ నడపకూడదు

0చూసినవారు
సిద్దిపేట: ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి టాక్సీ నడపకూడదు
సిద్దిపేట పట్టణంలో ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ ఆదివారం టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు, మద్యం సేవించి టాక్సీ నడపకూడదని, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, అతివేగంగా నడపవద్దని సూచించారు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడే బాధ్యత డ్రైవర్లదేనని, గమ్యస్థానం చేరేవరకు జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్