సిద్దిపేట: జాబ్ మేళాకు అనూహ్య స్పందన

0చూసినవారు
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన పోలీస్ ఉద్యోగ మిత్ర మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ మేళాలో 65 ప్రముఖ కంపెనీలు పాల్గొని, వివిధ రంగాల్లో అభ్యర్థులను ఎంపిక చేశాయి. మొత్తం 2 వేల మంది అభ్యర్థులు హాజరు కాగా, ఇంటర్వ్యూల అనంతరం 624 మందిని ఎంపిక చేశారు. అనంతరం పోలీసు కమిషనర్ ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పోలీస్ శాఖ శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సమాజ శ్రేయస్సులో భాగస్వామ్యం వహించడం తమ కర్తవ్యమని తెలిపారు.
Job Suitcase

Jobs near you