సిద్దిపేట వాయిస్ యాక్టర్ మరియు మోటివేషన్ స్పీకర్ GYJ వరుస ప్రమాద సంఘటనలపై ఆవేదన వ్యక్తం చేశారు. బస్సుల్లో ఫ్రీ టికెట్ల వల్ల రద్దీ పెరిగి, ప్రయాణికుల సంఖ్యకు మించి ఓవర్ లోడ్ తో బస్సులు నడుస్తున్నాయని, దీనిని అరికట్టడానికి ఫ్రీ టికెట్లను తీసివేసి, హాఫ్ లేదా ఫుల్ టికెట్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఆటోల్లో తనిఖీలు చేస్తున్న అధికారులు బస్సుల్లో ఓవర్ లోడ్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగరీత్యా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, దీనివల్ల వృద్ధులు, పిల్లలు ప్రయాణం నరకంగా మారిందని తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రతి జిల్లాకు ఫోర్ లైన్స్ హైవేలు, డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించి, మద్యపానం తాగి డ్రైవింగ్ చేసే వారిని అరికట్టాలని కోరారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.