ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్ధిపేట జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ హైమావతి మెమోంటో, ప్రశాంస పత్రాలు అందజేశారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహనతో ముందుకు సాగాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి పద్మజారాణి, అటవీశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.