సిద్దిపేట: పాఠ్య పుస్తకాలను రచించి మార్గదర్శకులుగా నిలవాలి

1చూసినవారు
సిద్దిపేట: పాఠ్య పుస్తకాలను రచించి మార్గదర్శకులుగా నిలవాలి
మారుతున్న విద్యా విషయ ప్రణాళికలకు అనుగుణంగా పాఠ్య గ్రంథాలను రచించి, ప్రచురించాలని, విద్యార్థులకు అధ్యాపకులు మార్గదర్శకులుగా నిలవాలని సోమవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత సూచించారు. కళాశాల రసాయన శాస్త్ర విభాగానికి చెందిన ముగ్గురు అధ్యాపకులు డాక్టర్ ఎం. శ్రీధర్, డాక్టర్ కే భాస్కర్, డాక్టర్ జి. శ్రీనివాస్ సంయుక్తంగా రచించిన "మెడిసినల్ కెమిస్ట్రీ" అనే పాఠ్యపుస్తకాన్ని ఆవిష్కరించి, ఇలాంటి అకాడమిక్ ప్రయత్నాలు విద్యా ప్రమాణాలను పెంపొందిస్తాయని, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పుస్తకాన్ని రచించిన ముగ్గురు రచయితలను ఆమె అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్