సిద్దిపేట: శిరస్త్రాణం వాడకం ప్రతి ఒక్కరి భాద్యత: ఏసిపి

0చూసినవారు
శనివారం సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో, మహీంద్రా ట్రాక్టర్ షోరూం, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంల సహకారంతో పోలీస్ సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ ఎం. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. పోలీస్ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించడంలో ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్