సిద్ధిపేట: కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమ పథకాలు

70చూసినవారు
సిద్ధిపేట: కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమ పథకాలు
కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమ పథకాలు అందుతాయని చిన్నకోడూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ అన్నారు. ఆదివారం చిన్నకోడూరు మండల పరిధిలోని కమ్మర్లపల్లి గ్రామంలో నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇండ్లకు ముగ్గు పోసి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల మాజీ అధ్యక్షులు నముండ్ల వినోద్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్