సమాజంలోని అన్ని వనరులను వినియోగించుకుంటూ మహిళలు మరింత శక్తిమంతంగా మారాలని సిద్ధిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది ఇంటర్మీడియట్ లో ఉత్తమ మార్కులు సాధించిన, ఇటీవల నిర్వహించిన వైజ్ఞానిక ప్రద్శనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.