ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, సిద్దిపేట త్రీ-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సురభి మెడికల్ కాలేజీలో షీ టీమ్ మంగళవారం ఒక భారీ అవగాహన సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో పోలీస్ అధికారులు విద్యార్థులకు సమాజంలో ఎదురయ్యే వివక్షలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా స్త్రీ, పురుషుల మధ్య సామాజిక వ్యత్యాసాలు, మహిళలపై వివక్ష వల్ల కలిగే నష్టాలు, మహిళలపై జరిగే హింసలు, వాటిని అరికట్టే చట్టాలపై విద్యార్థులకు వివరించారు.