మేడే పండుగ సందర్భంగా సిద్ధిపేటలోని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం 'మేడే' చిత్రాన్ని గురువారం ఆవిష్కరించారు. కార్మికుల ఆరోగ్యం, శ్రమశక్తి ముందడుగు వేయాలని, శ్రమకు తగిన ప్రతిఫలం అందాలని, ఎక్కడ శ్రామిక శక్తి వర్ధిల్లుతుందో అక్కడ దేశాభ్యున్నతి మూడుపువ్వులు ఆరుకాయలుగా వృద్ధి చెందుతుందని చిత్రకారులు తెలిపారు. నిర్లక్ష్యం వీడి అప్రమత్తమై నైపుణ్యంతో శ్రమించి ఉత్పత్తిని సాధించాలని, పారిశ్రామికవేత్తలు శ్రామికుల కష్టానికి ప్రతిఫలం సక్రమంగా అందించిననాడు సంతోషంగా మేడే ఆశయం నెరవేరినట్టుగా శ్రామికులు భావిస్తారని పేర్కొన్నారు.