సిద్దిపేట: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

1చూసినవారు
సిద్దిపేట: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
మండల కేంద్రంలోని ములుగుగ్రామంలో అప్పుల బాధ తట్టుకోలేక లెంకల ప్రశాంత్ కుమార్ (23) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తండ్రి ప్రమాదంలో కాలు విరిగి ఇంటికే పరిమితం కావడంతో, కుటుంబ భారం ప్రశాంత్పై పడింది. డ్రైవర్గా పనిచేస్తూ చేసిన అప్పులు తీర్చలేక, అక్టోబర్ 14న వ్యవసాయ భూమి వద్ద గడ్డి మందు తాగాడు. గజ్వేల్, గాంధీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ ఘటనపై ములుగు ఎస్సై విజయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్