రక్తదానం చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదానం అన్ని దానాల కన్నా గొప్పదని స్థానిక ప్రభుత్వాసుపత్రి బ్లడ్ బ్యాంక్ మెడికల్ అధికారి డాక్టర్ శ్రావణి అన్నారు. వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా సిద్దిపేట ఆస్పత్రిలో అత్యధిక సార్లు రక్తదానం చేసిన వారిని ఆర్ఎంవో సదానందం, శ్రావణి శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలన్నారు.