సిద్దిపేట పోలీసు కమిషనర్ గా ఎస్ఎమ్ విజయ్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సిటీ వెస్ట్ జోన్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్, సిద్దిపేట నూతన పోలీసు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు సిద్దిపేట పోలీసు కమిషనర్ గా ఉన్న అనురాధను ఎల్బీనగర్ డీసీపీగా బదిలీ చేశారు. ఈ బదిలీలతో సిద్దిపేట పోలీసు యంత్రాంగంలో మార్పులు చోటుచేసుకున్నాయి.