ఆదివారం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి మెదక్ జిల్లా మల్లకంబ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో అండర్-14, అండర్-17 బాలబాలికలు 50 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ఎస్జీఎఫ్ సెక్రటరీ సౌందర్య అన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఎదగాలని ఆమె విద్యార్థులకు సూచించారు. నవంబర్ 4, 5, 6వ తేదీల్లో చౌటుప్పల్లో రాష్ట్ర స్థాయి మల్లకంబ్ పోటీలు జరగనున్నాయి.