
హైదరాబాద్లో జయలలిత భవనం సీజ్
హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చెందిన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఆస్తి పన్ను బకాయిలు 2017 నుంచి పేరుకుపోవడంతో, ఫిబ్రవరిలో జయలలితకు సంబంధించిన వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. వారు స్పందించకపోవడంతో, ఉప కమిషనర్ సురేశ్ ఆదేశాల మేరకు ఏఎంసీ బాల్రాజ్ ఆధ్వర్యంలో ఈ చర్య తీసుకున్నారు. రాయితీ పోను రూ.82,91,822 మేర బకాయిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.




