అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు: సీఐ

0చూసినవారు
అక్బరుపేట మండలంలోని వీరారెడ్డిపల్లి, జంగపల్లి, గాజులపల్లి, అల్మాసిపూర్ గ్రామాల పొలిమేరలలో ఉన్న బండ మల్లన్న స్వామి ఆలయంలో ఈ నెల 15న గురువారం జరగనున్న జాతరపై శనివారం గ్రామ పెద్దలతో సమావేశం జరిగింది. దుబ్బాక సీఐ శ్రీనివాస్, భూంపల్లి ఎస్ఐ హరీష్ గౌడ్ పాల్గొని, జాతర ఏర్పాట్లను పరిశీలించారు. జాతరలో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్