సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల
విద్యార్థులు బుధవారం సైబర్ క్రైమ్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అడిషనల్ డీసీపీ కుశాల్కర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కళాశాల నుండి ముస్తాబాద్ చౌరస్తా మీదుగా తిరిగి కళాశాల వరకు సాగిన ఈ ర్యాలీలో, సోషల్ మీడియాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యాశకు పోయి అనవసరమైన మెయిల్స్, మెసేజ్‌లను తెరవద్దని సూచించారు.