సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఏ మొదటి సంవత్సరం విద్యార్థి యశ్వంత్, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరిగిన ఇంటర్ కాలేజ్ క్రాస్ కంట్రీ ఛాంపియన్ షిప్ బాలుర విభాగం 10 కి.మీ. ఈవెంట్‌లో జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ఫిబ్రవరి 15న జరిగే జాతీయస్థాయి ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే జట్టుకు ఎంపికైన యశ్వంత్‌ను కళాశాల ప్రిన్సిపల్ సునీత, ఇన్‌చార్జి ఫిజికల్ డైరెక్టర్ జి. బాలకిషన్ అభినందించారు. విద్యార్థి ప్రతిభకు గుర్తింపు లభించింది.