ప్రభుత్వ జూనియర్ కళాశాల (కోఎడ్యుకేషన్) ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, నాణానికి బొమ్మ, బొరుసూ రెండూ ఎంత ముఖ్యమో, విద్యార్థికి చదువు, క్రీడలు అంతే ముఖ్యమని అన్నారు. ఎస్‌జీఎఫ్ అండర్–19 విభాగం రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించిన కళాశాల విద్యార్థిని బరిగే కావ్యను బుధవారం కళాశాలలో అభినందించారు. రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో ట్రాక్ ఈవెంట్, రోడ్ ఈవెంట్ రెండింటిలోనూ కావ్య స్వర్ణ పతకాలు గెలుచుకుని కళాశాలకే కాకుండా జిల్లాకు కూడా గర్వకారణంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.