వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో, ఇంటర్మీడియెట్ విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా పరీక్షలకు సీరియస్ గా సన్నద్ధం కావాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ రెడ్డి సూచించారు. శుక్రవారం తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు డీఐఈఓను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో దాదాపు సిలబస్ పూర్తయిందని, ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించి, జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి మార్కులు నమోదు చేసినట్లు తెలిపారు.