బ్యాంకు సమస్యల పరిష్కారానికి మేనేజర్‌కు వినతిపత్రం అందజేత

1577చూసినవారు
బ్యాంకు సమస్యల పరిష్కారానికి మేనేజర్‌కు వినతిపత్రం అందజేత
సిద్దిపేట జిల్లా, పుల్లూరు గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రైతులు, ఉపాధి హామీ కూలీలు, పింఛన్ లబ్ధిదారుల ఖాతాలపై లాక్‌లు విధించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న రైతు భరోసా, వడ్లు అమ్మిన డబ్బులు, పింఛన్, నగదును కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖాతాదారులకు బ్యాంకులో పదివేల కంటే ఎక్కువ నగదు ఇవ్వలేకపోతున్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించి, ఖాతాలపై లాక్‌లు తొలగించాలని BSP పార్టీ జిల్లా అధ్యక్షులు ఉమేష్ పుల్లూరు బ్యాంకు మేనేజర్‌కు గురువారం వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్