సిద్దిపేట జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిణి నాగరాజమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. మైనార్టీ ఆర్థిక సంస్థ, శిక్షణ, ఉపాధి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) నేతృత్వంలో నిరుద్యోగ మైనార్టీ యువతకు విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా, ఒమన్, జర్మనీ, ఖతార్, గ్రీస్ దేశాల్లో ఈ అవకాశాలు ఉన్నాయని, ఆసక్తి గలవారు tomcom.resume@gmail.com లో సంప్రదించాలని సూచించారు.