కిశోర బాలికలు చదువుతో పాటుగా ప్రతీఅంశంపై అవగాహన కలిగి ఉండాలి

2చూసినవారు
కిశోర బాలికలు చదువుతో పాటుగా ప్రతీఅంశంపై అవగాహన కలిగి ఉండాలి
మహిళా వారోత్సవాల్లో భాగంగా సిద్ధిపేట జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కిశోర బాలికల మాక్ పార్లమెంట్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి జయదేవ్ ఆర్యా మాట్లాడుతూ, కిశోర బాలికలు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుకు సాగేలా ప్రతీ అంశంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బాలికలు విద్య, ఆరోగ్యం, నాయకత్వ లక్షణాల అభివృద్ధి, సమాజ నిర్మాణంలో తమ పాత్రను బలోపేతం చేసుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బాలల హక్కులు, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారత, బాల్య వివాహాల నిర్మూలన వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్