ప్రజాగొంతుక హరీష్ రావుని నిర్బంధించడం అప్రజాస్వామికం

3చూసినవారు
ప్రజాగొంతుక హరీష్ రావుని నిర్బంధించడం అప్రజాస్వామికం
ప్రజాస్వామ్య పాలనలో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావుని అరెస్టు చేయడాన్ని సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాముని శ్రీనివాస్ ఖండించారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న హరీష్ రావుపై అక్రమ కేసులు బనాయించి, నిర్బంధించి గొంతు నొక్కాలని చూస్తున్నారని, అరచేతితో సూర్యుడిని ఆపలేరని, నిర్బంధాలు, కేసులు హరీష్ రావుని ఆపలేవని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్