వికలాంగుల కమ్యూనిటీ భవనాన్ని వికలాంగుల అవసరలకే కేటాయించాలి

5చూసినవారు
వికలాంగుల కమ్యూనిటీ భవనాన్ని వికలాంగుల అవసరలకే కేటాయించాలి
హయత్‌నగర్ మండల ఆఫీస్ ప్రాంగణంలోని వికలాంగుల కమ్యూనిటీ హాల్ భవనాన్ని వికలాంగుల అవసరాలకే కేటాయించాలని VHPS కోర్ కమిటీ వైస్ చైర్మన్ అందే రాంబాబు డిమాండ్ చేశారు. ప్రజావాణిలో భాగంగా అబ్దుల్లాపూర్మెట్ ఎంపీడీవో శ్రీవాణికి వారు వినతిపత్రం సమర్పించారు. 2013లో బి. ఎం. పి. ఆర్. వై (BMPRY) నిధులతో నిర్మించిన ఈ హాల్‌ను ప్రస్తుతం 108 సిబ్బంది వాడుతుండటంతో, వికలాంగుల సమావేశాలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని పేర్కొన్నారు. వెంటనే స్పందించి ఈ భవనాన్ని వికలాంగులకే కేటాయించకపోతే VHPS ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని నాయకులతో కలిసి హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్