పెద్దపెద్ద గుంతలతో దుద్దెడ - అంకిరెడ్డిపల్లి రహదారి

1చూసినవారు
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ నుండి అంకిరెడ్డిపల్లి గ్రామపంచాయతీకి వెళ్లే ప్రధాన రహదారి పలుచోట్ల పెద్దపెద్ద గుంతలతో పాదచారులకు, వాహనదారులకు ఇబ్బందిగా మారింది. సుమారు కిలోమీటరు పొడవున ఉన్న ఈ రహదారిపై రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డుపై ఉన్న గుంతలను త్వరితగతిన పూడ్చి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. సంబంధిత రోడ్డు నిర్వహణ అధికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్