సిద్దిపేట యార్డును కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ నాయకులతో కలిసి బుధవారం సందర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ఆరా తీసిన ఆయన, దళారుల వ్యవస్థను అరికట్టడానికి ఐరిస్ బయోమెట్రిక్ ఏర్పాటు చేశారని తెలిపారు. రైతులకు ఇబ్బందులుంటే జిల్లా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని, ధాన్యం తడవకుండా మరిన్ని టార్పాలిన్ కవర్లు అందించాలని సూచించారు.