గత విద్యాసంవత్సరం పదోతరగతి పరీక్షల మూల్యాంకన పారితోషికాన్ని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ టీచర్స్ జాయింట్ యాక్షన్ జిల్లా కమిటీ, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, జేఏసీ టీచర్స్ ఆర్గనైజేషన్ల నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న మూల్యాంకన కేంద్రం వద్ద వారు నిరసన ప్రదర్శన నిర్వహించి, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డీఈఓ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందించారు.