భక్తులతో సందడిగా మారిన కొమురవెల్లి మల్లన్న ఆలయం

2చూసినవారు
భక్తులతో సందడిగా మారిన కొమురవెల్లి మల్లన్న ఆలయం
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మకు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆషాఢ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తుల రాక తగ్గినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ఈఓ, సిబ్బంది భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :