సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి శివారులోని కేజీబీవీ, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలను కలెక్టర్ హైమావతి శనివారం సందర్శించారు. గురుకుల పాఠశాలల్లో మెనూను తప్పనిసరిగా పాటిస్తూ నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని వడ్డించాలని ఆమె ఆదేశించారు. కేజీబీవీలో మెనూ ప్రకారం ఆహార నాణ్యతను పరిశీలించిన ఆమె, మిట్టపల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో కూరల నాణ్యత సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.