సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్, బిఆరెస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అమరవీరుల స్తూపం సాక్షిగా అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు. ఆదివారం సిద్ధిపేటలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలకు నిరసనగా, అత్తు ఇమామ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు అమరవీరుల స్థూపానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అత్తు ఇమామ్ ప్రవీణ్ కుమార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.