కొనుగోలు ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలి: హరీష్ రావు

0చూసినవారు
సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించారు. 50 రోజులుగా వడ్లు పోసి, గత 12 రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్న రైతులతో మాట్లాడి వారి ఆవేదనను తెలుసుకున్నారు. కల్లాల్లోనే వేచి చూస్తున్న రైతులకు భరోసా ఇచ్చారు. అక్కడి నుంచే ఆర్డీఓ, అధికారులకు ఫోన్ చేసి కొనుగోలు ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలని, పుల్లూరు కేంద్రంలో ఇంకా 40-50 లారీల వడ్లు పేరుకుపోయాయని, రైతులు 50 రోజులుగా వడ్లు పోశారని పేర్కొంటూ ఆదేశించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you