మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి భూ భారతీ అప్లికేషన్ల డిస్పోజల్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పెండింగ్ పిటిషన్లను ప్రణాళికాబద్ధంగా ఫీల్డ్ వెరిఫై చేసి, యుద్ధ ప్రాతిపదికన డిస్పోజ్ చేయాలని సర్వే అధికారులను ఆదేశించారు. భూ భారతీ అప్లికేషన్ల పరిష్కారంలో సర్వే అధికారుల పాత్ర కీలకమని ఆమె నొక్కి చెప్పారు.