శుక్రవారం జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా, సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. యువతలో, ప్రజలలో జాతీయ సమైక్యతను పెంపొందించడమే ఈ రన్ ముఖ్య ఉద్దేశ్యమని ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రతిరోజూ వాకింగ్, రన్నింగ్, యోగా, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటివి చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని ఆయన సూచించారు.