సిద్దిపేట: అభివృద్ధిలో ముందుకు నడిపించిన కలెక్టర్ సేవలు అభినందనీయం

67చూసినవారు
సిద్దిపేట: అభివృద్ధిలో ముందుకు నడిపించిన కలెక్టర్ సేవలు అభినందనీయం
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ, కలెక్టర్ గా జిల్లాను అభివృద్ధిలో ముందుకు నడిపించిన మిక్కిలినేని మను చౌదరి సేవలు అభినందనీయమని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. బదిలీపై వెళ్తున్న ఆయనను కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా వరకు అన్ని ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఎంతో కీలకంగా వ్యవహరించారన్నారు.

సంబంధిత పోస్ట్