జిల్లాలో ఉత్తమ విద్యనందించేందుకు డీఈఓ చేసిన సేవలు అభినందనీయం

1చూసినవారు
జిల్లాలో ఉత్తమ విద్యనందించేందుకు డీఈఓ చేసిన సేవలు అభినందనీయం
సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డీఈఓ శ్రీనివాస్ రెడ్డి పదవీవిరమణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ విద్యనందించేందుకు డీఈఓ శ్రీనివాస్ రెడ్డి చేసిన సేవలు అభినందనీయమని ప్రశంసించారు. విద్యాశాఖ కీలకమని, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలను సమన్వయం చేశారని తెలిపారు. ఉత్తమ పౌరులను రూపొందించడంలో 24 గంటలు జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.

ట్యాగ్స్ :