రాష్ట్రంలోని ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుల పెన్షన్ సొమ్మును, 2026 పదవ తరగతి మూల్యాంకన భృతిని అన్ని జిల్లాలకు వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. ఉపాధ్యాయుల సమస్యలన్నీ పోరాటాల ద్వారానే సాధించామని ఆయన తెలిపారు.