సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీసీ కుల సంఘాలు, దళిత, బహుజన, ప్రజాసంఘాల నాయకులు నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామంలో మృతి చెందిన పసికందుకు నివాళులర్పించారు. సామాజిక ప్రజాస్వామ్యవాదుల సమాఖ్య చైర్మన్ పోచబోయిన శ్రీహరి యాదవ్ మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరగాలని, దాడులు జరిగిన తర్వాత ఖండించడమే కాకుండా, దాడులు జరగకుండా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.